మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
అన్నానగర్: మాంగాడు పద్మావతి నగర్‌కి చెందిన సౌందరరాజన్ నిర్మాణ సంస్థ నిర్వహిస్తున్నాడు. ఇతని కుమారుడు రాజ్‌కుమార్ (25) వెలప్పన్ చావడిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా రాజ్ కుమార్ కాలేజీకి వెళ్లడం లేదు. దీంతో తల్లిదండ్రులు మందలించారు. రాజ్‌కుమార్ తల్లి కళాశాలకు వెళ్లి తన కుమారుడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని కళాశాల డీన్ ను కోరినట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కాలేజీ డీన్ రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి కౌన్సెలింగ్‌కు రావాలని చెప్పడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి తన గదిలోకి వెళ్లిన రాజ్ కుమార్ ఎంతసేపటికీ బయటకు రాలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా కొడుకు రాజ్‌కుమార్ ఉరివేసుకుని మృతి చెందడం చూసి షాక్‌కు గురయ్యారు. మాంగాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్న విద్యార్థి ఆత్మహత్య నిర్ణయానికి మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
అటవీ సరిహద్దు గ్రామంలో గర్భిణి ఇక్కట్లు
అన్నానగర్: తిరుపూర్ జిల్లాలోని ఉడుమలై సమీపంలోని ఆనైమలై టైగర్ రిజర్వ్‌లో ఉడుమలై, అ మరావతి అడవులు ఉన్నాయి. ఇక్కడ కోడంటూ రు, పసహారు, అటుమలై, కూలిపట్టి, కురుమలై, మావడపు, తాలింజి, తలింజివాయల్, కారుమూ టి తదితర ప్రాంతాల్లో గిరిజనులు అధిక సంఖ్య లో నివసిస్తున్నారు. ఈ స్థితిలో కురుమలైకి చెందిన సుమతి (20) అనే నిండు గర్భిణి గురువారం అస్వస్థతకు గురైంది. దీంతో గిరిజనులు జోలెకట్టి అందులో సుమతిని ఉంచి ఉడుమలై ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. దీనిపై వారు మాట్లాడుతూ దారి సౌకర్యం లేకపోవడం వల్లే ఇప్పటికీ అవస్థలు పడుతున్నట్లు వాపోయారు.
విద్యార్థినితో అసభ్యంగా
ప్రవర్తించిన కండక్టర్‌కు దేహశుద్ధి
తిరువొత్తియూరు: ప్రభుత్వ బస్సులో పాఠశాల విద్యార్థినికి లైంగిక వేధింపులకు గురిచేసిన బస్ కండక్టర్‌ను ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ నుంచి సిరమటంకు రోజు ప్రభుత్వ బస్సు వస్తోంది. ఈ బస్సులో రోజు ఎక్కువ మంది విద్యార్థినిలు, విద్యార్థులు, ప్రజ లు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ప్రభుత్వ బస్సు కండక్టర్ ఉన్నామలైకి చెందిన శశి (54) ఓ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని మరో స్టాపింగ్‌లో బస్సు నుంచి కిందకు దిగి ఇంటికి వెళ్లి జరిగిన సంగతి తల్లిదండ్రులకు చెప్పింది. దిగ్బ్రాంతి చెందిన తల్లిదండ్రులు గ్రామ ప్రజలు కండక్టర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment