చదువుకు మించిన ఐశ్వర్యం లేదు
కొరుక్కుపేట: విద్యార్థులకు చదువుకు మించిన ఐశ్వర్యం లేదని, క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని తెలుగు తరుణి సంస్థ అధ్యక్షురాలు కె.రమణి సూచించారు. ఈమేరకు చైన్నె నుంగంబాక్కంలోని వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథులుగా కె.రమణి, టాబ్లెట్స్ ఇండియా డైరెక్టర్ సి.వి.సుబ్బారావు, ఆంధ్రా కళా స్రవంతి అధ్యక్షులు జేఎం.నాయుడు, చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ పావని పాల్గొన్నారు. ఈసందర్భంగా చిన్నారులు బాలల దినోత్సవ విశిష్టితను తెలియజేసే పలు ప్రదర్శనలతో, నాటికలతో, పాటలతో, సంభాషణలతో ఆకట్టుకున్నారు. అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆంధ్ర కళా స్రవంతి తరఫున విద్యార్థులు యూనిఫాం అందజేశారు. అలాగే ఒక్కో విద్యార్థికి రూ.100 చొప్పన జేఎం నాయుడు కానుకగా అందించారు. గత రెండేళ్లుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న సీవీ సుబ్బారావుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు తరుణి తరఫున వైద్యశిబిరం నిర్వహించి విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. డాక్టర్ పావని వైద్య బృంద చిన్నారులకు ఉచిత దంతపరీక్షలు నిర్వహించారు. సెక్రటరీ దేవసేన, ట్రెజరర్ మాజేటి అపర్ణ, సభ్యులు శైలజ, నందిని, వసంతరాణి, విశాలాక్షి, మాలతీ, కరస్పాండెంట్ రామకృష్ణ, ఉపాధ్యక్షులు వీఎన్ హరినాథ్, విజయలక్ష్మి, కోశాధికారి రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment