ఉద్యోగుల కోసం వేదిక
● ఆవిష్కరించిన మంత్రి టీఆర్‌బీ రాజా
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఫ్రంట్ లైన్– ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కల్పన దిశగా ఒక వేదికగా మెనీజాబ్స్.కా మ్ ఏర్పాటైంది. శుక్రవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఈ వేదికను పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రా జా ఆవిష్కరించారు. భారతదేశపు అతిపెద్ద మ్యాట్రి మోనీ సర్వీస్ ప్రొవైడర్ సంస్థగా ఉన్న మ్యాట్రిమోనీ. కామ్ తమిళనాడులో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారి కోసం ఈ వేదికను ఏర్పాటు చేసింది. మ్యాట్రిమోనీ.కామ్ గ్రూప్ సీఈఓ మురుగవేల్ జానకిరామన్ తో కలసి తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబ డుల ప్రోత్సాహం, వాణిజ్య శాఖల మంత్రి టీఆర్‌బీ రాజా ఈ యాప్ గురించి వివరించారు. తమిళనాడు లో తమిళం, ఆంగ్లంలో ఈ వేదిక అందుబాటులో ఉంటుందన్నారు. అనేక ఉద్యోగాల పోర్టల్‌ను ఇందులో రూపొందించినట్టు వివరించారు. అందరికీ ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేస్తూ, ఈ యాప్ ఉపాధి రేటును పెంచడానికి దోహ దకరంగా ఉంటుందన్నారు. మురుగవేల్ మాట్లా డుతూ తమిళనాడులో జాబ్ మార్కెట్‌లో మెనీ జాబ్స్‌ను ప్రారంభించడం, ఈయాప్ తమి ళనాడులో ఫ్రంట్‌లైన్, ఎంట్రీ–లెవల్ ఉద్యోగ అవకాశాల కోసం రూపొందించినట్టు వివరించారు. మెనీ జాబ్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన ఆరు నెలల్లో ఒక మిలియన్ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment