క్లుప్తంగా
విద్యార్థిని వేధించిన కేసులో
ఇద్దరి అరెస్టు
తిరువొత్తియూరు: తేని జిల్లా వరుసనాడు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలో ప్లస్– 2 చదువుతోంది. ఆమె కొన్ని రోజుల క్రితం పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. ఆ మార్గంలో బైక్‌పై వచ్చిన వరుసనాడు వైగై నగర్‌కు చెందిన పాండ్య సెల్వం (23), దైవేంద్రన్ (21) బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇరుగుపొరుగువారు రావడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరుసనాడు పోలీసులు కేసు నమోదు చేసి పాండియ సెల్వం, దైవేంద్రన్‌ను అరెస్టు చేశారు.
అమిత్ షా క్షమాపణలు
చెప్పాలంటూ నినాదాలు
● వీఎల్‌టీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
కొరుక్కుపేట: అంబేడ్కర్‌ను హీనంగా మాట్లాడిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ వీఎల్‌టీ పార్టీ తరపున తాంబరంలో నిరసన వ్యక్తం చేశారు. చైన్నె తాంబరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ వసంతకుమారి కమలకన్నన్, డిప్యూటీ మేయర్ కో– కామరాజ్ , కార్పొరేషన్ కమిషనర్ బాలచందర్ సమక్షంలో జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన 20వ వార్డు వీఎల్‌టీ పార్టీ సభ్యుడు ముత్తుకుమార్, 50వ వార్డు హ్యుమానిటీ పీపుల్స్ పార్టీ సభ్యుడు యాకూబ్, వీఎల్‌టీ పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ చిత్రపటంతో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి అమిత్‌షా వ్యాఖ్యాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. అంబేడ్కర్ గురించి హీనంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరారు.
తిరుత్తణిలో గుంతల రోడ్లకు మహర్దశ
తిరుత్తణి: శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మెట్లోత్సవం, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వందలాది వాహనాల్లో వేలాది మంది భక్తులు తిరుత్తణికి చేరుకోనున్నారు. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల ద్వారా కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల భారీ వర్షానికి దెబ్బతిన్న పట్టణంలోని రాష్ట్ర రహదారులపై ఏర్పడ్డ గుంతలు పూడ్చే విధంగా హైవే శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సబ్ డివిజన్ సహాయ ఇంజినీరు రఘురామన్ ఆధ్వర్యంలో చైన్నె బైపాస్‌రోడ్డు, చిత్తూరు రోడ్డు, అరక్కోణం రోడ్డు మార్గాల్లో ఏర్పడ్డ గుంతల ప్రాంతాల్లో తారు పోసి రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేపట్టారు. వాహనాల రాకపోకలకు వసతులు కల్పించడంతో ప్రయాణికులు, వాహన చోదకులు హర్షం వ్యక్తం చేశారు.
బస్సులో యువతిపై
లైంగిక వేధింపులు
● ప్రైవేట్ స్కూల్ టీచర్ అరెస్టు
తిరువొత్తియూరు: బస్సులోయువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోయంబత్తూరులోని రత్నపురికి చెందిన 18 ఏళ్ల యువతి కోయంబత్తూరు నుంచి రామనాథపురం వెళ్లేందుకు తన తల్లితో కలిసి బస్సులో బయలుదేరారు. యువతి ఉన్న సీటు వెనుక 42 ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. బస్సు అవినాసి రోడ్డు దండు మారియమ్మన్ దేవాలయం వద్ద వస్తున్న సమయంలో యువతి సీటు వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి శబ్ధం చేయడంతో బస్సులోని ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకొని కోయంబత్తూరు రేస్‌కోర్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసుల విచారణలో అతడు పొల్లాచ్చి – ఉడుమలై రోడ్డు అన్నానగర్‌కు చెందిన రవి (42) అని, కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
చైన్నెకి అక్రమంగా తరలిస్తున్న
480 మద్యం బాటిళ్లు సీజ్
అన్నానగర్: చెంగల్పట్టు సమీపం పరనూర్ టోల్ గేట్ నుంచి చైన్నెకి కారులో బయటి రాష్ట్రాల మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు విల్లుప్పురం జోన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులకు సోమవారం సమాచారం అందింది. దీని ఆధారంగా చెంగల్పట్టు పరనూర్ టోల్ ప్లాజా వద్ద కార్లను ముమ్మరంగా సోదాలు చేశారు. ఆ సమయంలో పాండిచ్చేరి నుంచి వచ్చిన కారు ఆపి పరిశీలన చేసినప్పుడు. అందులో బీరు, విస్కీ, బ్రాండీ దాదాపు రూ.4 లక్షల విలువైన 480 మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు. దీంతో అధికారులు వెంటనే చెంగల్‌పట్టు లిక్కర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డివిజన్ పోలీసులకు సమాచారం అందించి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను వారికి అందజేశారు. అలాగే పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా దిండివనం పక్కనే ఉన్న తమంగళం గ్రామానికి చెందిన దేవరాజ్ కుమారుడు దామోదరన్ పాండిచ్చేరికి కారులో వెళ్లి మద్యం బాటిళ్లుకొని చైన్నెలోని అన్నానగర్ ప్రాంతంలో విక్రయించేందుకు అక్రమంగా తరలించినట్లు వెల్లడైంది. అనంతరం దామోదరన్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment