బుల్లెట్ చిత్ర షూటింగ్ పూర్తి
తమిళసినిమా: ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇప్పుడు హీరోగా సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ముని, కాంచన తదితర హారర్ కథా చిత్రాలతో విజయాలను అందుకున్న ఈయన్ని జిగర్తాండ డబులెక్స్ చిత్రం హిట్ కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం రాఘవ లారెన్స్ నటిస్తున్న చిత్రాలలో బుల్లెట్ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా రాఘవ లారెన్స్ సోదరుడు ఎల్విన్ నటుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఈయన ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ పతాకంపై కదిరేశన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్నసీ పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు అరుళ్ నిధి హీరోగా డైరీ అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. నటి వైశాలి రాజ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బుల్లెట్ అనే టైటిల్‌ను చూస్తుంటేనే ఇది పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment