సాగునీటి కాలువల్లో రసాయనాల వ్యర్థాలు
సేలం: పంట పొలాలకు నీటిని వదిలే కాలువల్లో రాసాయన వ్యర్థాలు కలవకుండా అడ్డుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సేలం జిల్లావ్యాప్తంగా పలు కర్మాగారులు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా అలాగే రాత్రి వేళల్లో పంట పొలాలకు వెళ్లే కాలువల్లో వదులుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటా భూగర్భ జలాలు కాలుష్యం కావడంతో పాటు పండించే పంటల్లో కూడా రసాయనాలు కలపడం వల్ల అటు పంట నష్టం, ఇటు అలాంటి పంట కారణంగా ప్రజల ఆరోగ్య నష్టం కూడా ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని తిరుమణిముత్తారు, రాజవాయ్‌కాల్ (పంట పొలాలకు నీరు వెళ్లే కాలువ) సమన్వయ సమితి చైర్మన్ కొండలాంపట్టి ఎం.తంగరాజ్ జిల్లా కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ కార్యాలయం నుంచి ఏఈ కలైవేందన్, జగన్నాథన్, కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం నుంచి అధికారులు సోమవారం స్వయంగా వచ్చి పరిశీలించారు. కాలువలో రసాయన నీటిని విడుదల చేస్తున్న కర్మాగారాలపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment