● భద్రత కోసం 300 మంది పోలీసులు
తిరువొత్తియూరు: కోయంబేడు మార్కెట్‌లో గురువారం నుంచి ప్రారంభం కానున్న పొంగల్ పండుగకు ప్రత్యేక మార్కెట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. వివరాలు.. పొంగల్ పండుగ సందర్భంగా కోయంబేడు మార్కెట్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచి 16వ తేదీ వరకు వర్తక సంఘం తరపున ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మార్కెట్ దుకాణాదారులే కాకుండా బయటి వ్యాపారులు కూడా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఈ ప్రత్యేక మార్కెట్‌లో విల్లుపురం, కడలూరు, సేలం మరియు పుదు చ్చేరి తదితర ప్రాంతాల నుంచి చెరకు, పసుపు, అల్లం విక్రయిస్తారు. ఈ సరుకులు తీసుకెళ్లే వాహనాల పార్కింగ్ కోసం 3 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ చేశారు. కోయంబేడు మార్కెట్, ప్రత్యేక మార్కెట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగనుందని, స్టోర్ యాజమాన్యం తరపున కోయంబేడు ట్రాఫిక్‌తో సంప్రదించి ట్రాఫిక్ జామ్‌ను చక్కదిద్దేందుకు, నేర ఘటనల నివారణకు నేటి నుంచి 300 మందికి పైగా పోలీసు లు బందోబస్తులో నిమగ్నమై ఉంటారని తెలి పారు. లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు. ప్రత్యేక మార్కెట్ సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యాపారులు వ్యాపారం చేయరాదని, వర్తక సంఘం నిర్వాహకులకు సహకారం అందించాలని కోరారు. స్టోర్ మేనేజ్‌మెంట్ టీమ్‌కు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఇదిలా ఉండగా కొయంబేడు డిప్యూటీ కమిషనర్ సుబ్బులక్ష్మి ఆదేశం మేరకు పోలీసులు బైనాక్యులర్స్ ద్వారా మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హై టవర్‌ను పర్యవేక్షిస్తున్నారు. మారువేషంలో గస్తీ కూడా నిర్వహిస్తున్నారు.
టీసీడబ్ల్యూఐ సర్వే
● తొలి 3 నగరాలలో చైన్నెకు చోటు
సాక్షి, చైన్నె: ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా (టీసీబ్ల్యూఐ)సర్వేలో సోషల్, ఇండస్ట్రియ ల్ ఇన్‌క్లూజన్ ఇండెక్స్‌లో మొదటి 3 నగరాల్లో చైన్నె తన స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో మహిళల కోసం అగ్ర నగరాలు’ సూచిక మూడవ ఎడిషన్‌లో తమిళనాడు ఆధిపత్యం కొనసాగింది. టాప్ 25లో చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి, వే లూరు, మదురై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ నగరాలకు చోటు దక్కాయి, ఇక బెంగళూరు, చైన్నె, ముంబయి, హైదరాబాద్, పుణె తొలి ఐదు స్థానా ల్లో నిలిచాయి. వైవిధ్యం, ఈక్విటీ ఇన్‌క్లూజన్(డీఈఐ) సొల్యూషన్స్‌లో భారతదేశ అగ్రగామిగా ఉన్న అవతార్ గ్రూప్, భారతదేశంలోని ప్రముఖ వర్క్‌ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థ, భారతదేశంలో మహిళల కోసం టాప్ సిటీస్ ఇండెక్స్ మూడవ ఎడిషన్‌ను బుధవారం స్థానికంగా ప్రకటించింది. విలేకరుల సమావేశంలో అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ అవకాశాలకు నగరాలు పునాదులని, ఇక్కడ సీ్త్రలు ఎలా జీవిస్తారో, పని చేస్తారో, అభివృద్ధి చెందుతారో అన్నది ముఖ్యం అని వివరించారు. అందుకే మన నగరాలలో ప్రధాన సూత్రా లు, సాంస్కృతిక ఫాబ్రిక్‌పై స్పష్టమైన అవగాహన, మహిళల పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి కీలకం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా . అవతార్ వార్షిక సూచిక ‘భారతదేశంలో మహిళల కోసం అగ్ర నగరాలు’ డేటా–సెంట్రిక్, సాక్ష్యం–ఆధారిత విధానాన్ని ఉపయోగించి కచ్చి తంగా నిర్ణయించి ప్రకటించామన్నారు. 2047 నాటికి విక్షిత్ భారత్ కలను సాకారం చేసుకోవడానికి, పురుషులతో సమానంగా విజయం సాధించడానికి భారతీయ మహిళా నిపుణుల అవసరం, మహిళల బలాన్ని ఆప్టిమైజ్ చేయగల వాతావరణాన్ని అందిస్తేనే సాధ్యమవుతుందన్నారు. దేశంలో మహిళల కోసం అగ్ర నగరాలు, రోల్ మోడల్ నగరాలు, ఉత్తమ అభ్యాసాలను గుర్తిస్తుందన్నా రు. అవతార్ పరిశోధనలో ఫిబ్రవరి 2024 నుంచి నవంబర్ 2024 వరకు దేశవ్యాప్తంగా 60 నగరాలలో సర్వే నిర్వహించామన్నారు.
లారీని ఢీకొన్న కారు
● ఇద్దరు వ్యాపారుల దుర్మరణం
సేలం: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యాపారులు దుర్మరణం చెందగా, మరో వ్యాపారి గాయాలపాలయ్యాడు. వివరాలు.. తిరుపూర్ జిల్లా తారాపురం అలంకియం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (40). నగల దుకాణం నడుపుతున్న ఇతను అక్కడ ఉన్న ప్రభుత్వ బ్యాంకులో నగల వ్యాల్యువర్‌గానూ పని చేస్తున్నాడు. ఇదేవిధంగా దిండుగల్ జిల్లా పళని వాకరై ప్రాంతానికి చెందిన వ్యక్తి షణ్ముగ ప్రతీప్ (36) రియల్‌ఎస్టేట్ వ్యాపారి. అలంగాయం సాలై ఎంఎస్‌పీ నగర్ ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ (40). ఈయన తారాపురం జాతీయ రహదారిలో మద్యం దుకాణం నడుపుతున్నాడు. స్నేహితులైన ఈ ముగ్గురు మంగళవారం పని విషయంగా కారులో పొల్లాచ్చికి వెళ్లారు. తర్వాత అక్కడి నుంచి తారాపురం తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి తారాపురం సమీపంలో దాసపట్టి ప్రాంతంలో వస్తుండగా అకస్మాత్తుగా కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో రాజేంద్రన్, ప్రతీప్‌లు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సెల్వరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న తారాపురం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, గాయపడిన సెల్వరాజ్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment