ఆమ్నీలో చార్జీల వడ్డన
● రెండింతలు పెంపు
సాక్షి, చైన్నె: చైన్నె నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా ఆమ్నీ ప్రైవేటు బస్సులలో చార్జీలను అమాంతం పెంచేశారు. రెండింతల మేరకు చార్జీలు పెరగడంతో ప్రయాణికుల నెత్తిన అదనపు భారం పడినట్లయ్యింది. సంక్రాంతికి ఈసారి అధిక సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే చాలు, అదనంగా తొమ్మిది రోజులు సెలువు దక్కినట్టే అన్నట్టుగా పరిస్థితి ఉంది. దీంతో చైన్నె వంటి నగరాలలో ఉన్న వాళ్లు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రత్యే రైళ్లు, సాధారణంగా నడిచే రైళ్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. తత్కల్ టికెట్ల కోసం జనం ఎదురు చూస్తున్నారు. అలాగే, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం ప్రత్యేక బస్సులను ప్రకటించింది. అదే సమయంలో ప్రైవేటు ఆమ్నీ బస్సులు సైతం లగ్జరీ సేవలను అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల 10, 11, 12, 13 తేదీలలో చైన్నె నుంచి దక్షిణ తమిళనాడులోని తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, నాగర్ కోయిల్, తూత్తుకుడి వంటి నగరాలకు , డెల్టాలోని కడలూరు, నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్, తంజావూరు వైపుగా, కొంగు మండలంలోని సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు వంటి నగరాలకు ఆమ్నీ లగ్జరీ బస్సులు ప్రత్యేక సేవలకు రెడీ అయ్యాయి. అదే సమయంలో ఆయా బస్సులలో సాధారణం కంటే రెట్టింపుగా చార్జీలు ప్రస్తుం పెంచేశారు. పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని లగ్జరీసేవలకు అనుగుణంగా బస్సులలో చార్జీల వసూళ్ల మీద వాటి యాజమాన్యాలు దృష్టి పెట్టాయి.
రెట్టింపుగా చార్జీలు..
సాధారణంగా చైన్నె నుంచి దక్షిణ తమిళనాడు వైపుగా ఉండే నగరాలకు ఆమ్నీ బస్సులలో ఏసీ సౌకర్యం లేకుంటే రూ. 750 నుంచి 1000 వరకు, ఏసీ సౌకర్యం బస్సులు రూ. 1,500 వరకు చార్జీలను వసూళ్లు చేస్తుంటారు. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో చార్జీలను పెంచేశారు. సుమారు 3 వేల వరకు కొన్ని ఆమ్నీ ట్రావెల్జ్ జారీల మోత మోగించే పనిలో పడ్డాయి. మదురైకు ఏసీ సీటింగ్‌లో రూ. 3 వేలు, స్లీపర్‌లో రూ.3,500లుగా చార్జీలను నిర్ణయించారు. తిరునల్వేలి తూత్తుకుడిలకు అయితే నాన్ ఏసీ రూ. 2,500, ఏసీ సీటింగ్ రూ. 3 వేలు, స్లీపర్ రూ. 4 వేలుగా, నాగర్‌కోయిల్‌కు అదనంగా మరో రూ. 500 చొప్పున, తిరుచ్చికి రూ. 2,500 వరకు, తెన్‌కాశి, విరుదునగర్ వైపుగా రూ. 3 వేల వరకు చార్జీలను నిర్ణయించి పెంచేయడం గమనార్హం. లగ్జరీ సేవతో బస్సులలో పయనించేందుకు అధికసంఖ్యలో రిజర్వేషన్లపై దృష్టి పెట్టే వాళ్లుసైతం ఉండడం గమనార్హం. అదే సమయంలో అధిక చార్జీల వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పదని రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ బస్సులకు సంబంధించిన ఫిర్యాదులు, సమాచారాల కోసం 94450 14436 నంబరు, ఆమ్నీ బస్సులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1800 4256151, 044 24749002, 26280445, 26281611ను రవాణా అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment