ఘనంగా భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవం
సాక్షి,చైన్నె: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వార్షికోత్సవాన్ని చైన్నెలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం, చైన్నెలోని ఎవర్విన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌సంయుక్తంగా కలసి బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 2 వేలమంది విద్యార్థులు వివిధ భంగిమల్లో ఐఎండీ 150ని రూపొందించి ఆకట్టకున్నారు. ఇంధ్ర ధనస్సు, వర్షపు చినుకుల డ్రాయింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 25 మంది బాలికలు తమ ముఖాలకు, చేతులకు ఐఎండీ 150, ఆర్‌ఎంసీ80తో రంగులు వేసుకుని కనువిందు చేశారు. చివరిలో 400 మంది విద్యార్థులు ఐఎండీ 150 టీషర్టులు, టోపీలు ధరించి ఐఎండీ ,ఆర్‌ఎంసీ విధులు గురించి అవగాహన కల్పించే ఆలోచనతో కొలత్తూరు ప్రధాన రహదారిపై ఉరేగించారు. ఈ కార్యక్రమంలో చైన్నెలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధిపతి డాక్టర్ ఎస్ బాలచంద్రన్, ఎవర్విన్ గ్రూప్ స్కూల్ సీఈవో వి. మహేశ్వరి, ఫౌండేర్ సీనియర్ ప్రిన్సిపల్ బి. పురుషోత్తమన్, ఎవర్విన్ గ్రూప్ స్కూల్ డైరెక్టర్లు విద్య, మురళి, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment