తిరువొత్తియూరు: చైన్నె, తాంబరం సమీపంలో టిప్పర్, కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో చిక్కుకున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గంట సమయం తర్వాత అగ్నిమాపక సిబ్బంది కారులో నుంచి రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. వివరాలు.. పుదుచ్చేరికి చెందిన లక్ష్మి కాంతం (38) ఇతను చైన్నె విమానాశ్రయంలో నుంచి తన బంధువును పిలుచుకుని రావడానికి మంగళవారం తెల్లవారుజామున కారులో వచ్చాడు. వెస్ట్ తాంబరం గాంధీ రోడ్డు కూడలి వద్ద వస్తుండగా టిప్పర్ హఠాత్తుగా కారును ఢీకొట్టింది. ఇందులో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. లక్ష్మికాంతంకు తీవ్ర గాయమై కారు లోపల చిక్కుకున్న కున్నాడు. సమాచారం అందుకున్న తాంబరం అగ్నిమాపక సిబ్బంది లక్ష్మికాంతాన్ని గంట సమయం తర్వాత పోరాడి బయటకు తీసి క్రోమ్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. ఈ ప్రమాదంలో వల్ల మంగళవారం తాంబరము పల్లావరం రోడ్డులో గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నయనతారపై ధనుష్
కేసు విచారణ వాయిదా
తమిళసినిమా: నటి నయనతారపై నటుడు ధనుష్ చైన్నె హైకోర్టులో వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుపై తర్వాత ఆసక్తి నెలకొంది. ఇవాళ చూస్తే నటి నయనతార తన బయోపిక్‌ను నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్ పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని విడుదల హక్కులను నెట్‌ప్లిక్స్ ఓటిటి సంస్థ పొంది ఇటీవలే విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో నటుడు ధనుష్ తన వండర్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ సేతుపతి, నయనతార జంటగా నిర్మించిన నాను రౌడీదాన్ చిత్రంలోని రెండు మూడు నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను ఆ డాక్యుమెంటరీ చిత్రంలో వాడుకున్నారు. దీంతో తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడుకున్నందుకుగాను నటుడు ధనుష్ నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అ పిటిషన్ పై వివరణ కోరుతూ గత నెల 8వ తేదీన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తోపాటూ నెట్‌ప్లిక్స్ ఓటీటీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు బుధవారం మరోసారి కోర్టులో న్యాయమూర్తి అబ్దుల్ ఖుదూస్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా నెట్ ఫిక్స్ ఓటేటి సంస్థ వివరణ ఇవ్వడానికి తమకు కాలావకాశం కావాలని కోరడంతో, అందుకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment