చిన్నారిపై లైంగిక దాడి కేసు..
● అన్నాడీఎంకే నేత, మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు జైలు
సేలం: చైన్నె అన్నానగర్‌లో 10 ఏళ్ల చిన్నారి లైంగిక దాడికి గురైన ఘటనకు సంబంధించిన అన్నాడీఎంకే నిర్వాహకుడు, మహిళా పోలీసు అధికారిని సిట్ అరెస్టు చేసింది. చైన్నె అన్నానగర్ చిన్నారిపై లైంగిక దాడి ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ స్థితిలో నేరం ఆరోపించబడిన సతీష్‌కు మద్దతుగా వ్యవహరించిన అన్నాడీఎంకే 103వ వార్డు కార్యదర్శి సుధాకర్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ కేసును న్యాయంగా విచారించని మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ రాజిని సిట్ బృందం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment