జీవీ ప్రకాష్ కుమార్ కింగ్‌స్టన్ ఫస్ట్‌లుక్
తమిళసినిమా: నిజాలను నిర్భయంగా చెప్పడంలో నటి నిత్యామీనన్ ఎప్పుడు వెనుకాడరు. అది ఆమె నైజం. అయితే దీన్ని కొందరు పొగరు అని కూడా అంటారు. ఎవరేమనుకున్నా నేనింతే అనే రకం నిత్యామీనన్. పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెత మాదిరిగా కొంచెం పొట్టిగా ఉన్నా నటిగా మాత్రం ఈ కేరళ భామ ఘనాపాఠే. ఇటీవలే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న నిత్యామీనన్‌కు ఇప్పుడు కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. నటుడు ధనుష్ సరసన ఇడ్లీ కడై చిత్రంలో నటిస్తున్న ఈమె, నటుడు జయం రవికి జంటగా కాదలిక్క నెరమిల్లై చిత్రంలో నటించారు. క్రితిక ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా తెరపై కలవడానికి సిద్ధమవుతోంది. కాగా ఇటీవల జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నటి నిత్యామీనన్ మాట్లాడుతూ మహిళలకు సినీ రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ రెండవ స్థానమే అని పేర్కొన్నారు. సాధారణంగా ఒక ప్రేమ కథా చిత్రంలో చాలా ఈజీగా నటించేయవచ్చు అనే భావన ఉంటుందన్నారు. అయితే నిజానికి అలా ఉండదని అన్నారు. మరో విషయం ఏంటంటే ఒక చిత్రంలో ప్రధాన పాత్ర పోషించినా తాము రెండో స్థానానికే పరిమితం అవుతామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
తమిళసినిమా: ప్రముఖ నటుడు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కింగ్‌స్టన్. విశేషం ఏమిటంటే ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రం ఇది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈయన తన పారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అదే విధంగా దీనికి సంగీతాన్ని జీవీ.ప్రకాష్ కుమార్‌నే అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా కామల్ ప్రకాష్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఇది సముద్రం నేపథ్యంలో సాగే హార్రర్ ఎడ్వేంచర్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకిగా దివ్యభారతి నటిస్తుండగా, మేర్క్ తొడర్చి మలై చిత్రం ఫేమ్ ఆంటోనీ, చేతన్ కుమరవేల్, సాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గోకుల్ బినాయ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. దీన్ని నటుడు శివకార్తికేయన్ విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. చిత్ర టీజర్‌ను ఈనెల 9న విడుదల చేయనున్నట్లు యూనిట్ సభ్యులు చెప్పారు. కాగా జీ స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ బన్సాల్ తెలుపుతూ మంచి బలమైన కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించాలన్నదే తమ సంస్థ లక్ష్యం అన్నారు. కింగ్‌స్టన్ దాన్ని నిరూపిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జీవీ.ప్రకాష్ కుమార్ పారలాల్ యూనివర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ఘనంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కింగ్‌స్టన్ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సినీ వర్గాల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
నిత్యామీనన్
సీ్త్ర ఎప్పుడూ
రెండవ స్థానంలోనే..
Comments
Please login to add a commentAdd a comment