● యువకుడు అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె మంగాడుకు చెందిన 23 ఏళ్ల యువతి మధురవాయల్ నుంపాల్ రోడ్డులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈమెకు కోవూరు ప్రాంతానికి చెందిన ఈనోక్‌తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో ఈనోక్ తనను ప్రేమించాలంటూ యువతిని తరచూ వేధించేవాడు. దీంతో యువతి ఈనోక్‌తో మాట్లాడడం మానేసింది. ఈ స్థితిలో సోమవారం సాయంత్రం పని ముగించుకుని బయటకు వచ్చిన యువతిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు.
ఒక్కసారిగా ఆగ్రహంతో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో యువతి మధురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈనోక్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment