![పోర్న్ వీడియో కేసులో మరో ఇద్దరి అరెస్ట్ట్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/18/17cni08-300102_mr-1737141301-0.jpg.webp?itok=pFvWe9p8)
పోర్న్ వీడియో కేసులో మరో ఇద్దరి అరెస్ట్ట్
అన్నానగర్: చిన్నారుల పోర్న్ వీడియోల కేసులో మరో ఇద్దరిని మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నెలోని మైలాపూర్‌లో తమ కుమార్తెను సెక్స్ వర్క్‌లో ఉంచి, దానిని వీడియో తీసి ఆన్‌లైన్‌లో విక్రయించిన జంటను మైలాపూర్ మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద గురువారం అరెస్టు చేశారు. ఈ కేసులో బాలిక తండ్రి సెల్‌ఫోన్‌లోని వీడియోలు, కమ్యూనికేషన్లపై పోలీసులు విచారణ చేపట్టారు. అందులో అమ్మాయిల అశ్లీల వీడియోలను అక్రమంగా అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అసభ్యకర వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు సహకరించాడని పట్టినప్పక్కం శ్రీనివాసపురానికి చెందిన వ్యక్తి, తాంబరానికి చెందిన మరొకరిని శుక్రవారం మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నిషేధించబడిన 6 చైల్డ్ పోర్న్ వీడియోలు ఉన్నాయని తేలింది. అనంతరం అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల సెల్‌ఫోన్లతో సహా వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మహిళా పోలీసులు వీడియోలో ఉన్న బాలికలను రహస్యంగా విచారిస్తున్నారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు
అన్నానగర్: చైన్నె అమందైక్కరై మెయిన్ రోడ్డు సమీపంలోని స్పా సెంటర్‌లో మహిళలు వ్యభిచారం చేస్తున్నట్టు ప్రత్యేక పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆ తర్వాత గురువారం రాత్రి ప్రత్యేక పోలీసులు స్పా సెంటర్ దగ్గర నిలబడి దుస్తులు మార్చుకునే గదిపై ఓ కన్నేసి ఉంచారు. అప్పుడు వారు స్పా సెంటర్ లోపలకి, బయటికి వెళ్తున్న చాలా మంది పురుషులను కనుగొన్నారు. దీంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులు స్పా సెంటర్‌లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో స్పా పేరుతో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలను రక్షించారు. అరెస్టయినవారు చైన్నెలోని తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్ (27), అడయార్ ప్రాంతానికి చెందిన మోహన్(33)లను ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలులో ఉంచారు. రక్షించిన ఇద్దరు మహిళలను మైలాపూర్‌లోని ప్రభుత్వ మహిళా ఆశ్రమానికి అప్పగించారు.
ప్లాట్‌ఫారంపై ప్రసవం
● సేలం రైల్వే స్టేషన్‌లో జన్మించిన శిశువు, తల్లి సురక్షితం
సేలం: సేలం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై మహిళ శిశువును ప్రసవించింది. వేలూరు జిల్లాకు చెందిన సూర్య, లైలా దంపతులు కేరళలో ఉంటూ కూలి పనులు చేస్తూ వచ్చారు. ఈ స్థితిలో లైలా నిండు గర్భవతి. దీంతో ప్రసవం కోసం సొంత ఊరుకు గురువారం రాత్రి కేరళ నుంచి రైలులో వేలూరుకు బయల్దేరారు. రైలు సేలం జంక్షన్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన సమయంలో లైలాకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే ఆమెను రైలులో నుంచి కిందకు దించారు. తర్వాత 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. సేలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రైల్వేస్టేషన్‌కు 108 అంబులెన్స్ వచ్చింది. అయితే ఇంతలోపే రైల్వే స్టేషన్‌లో 5వ ప్లాట్‌ఫారంపై లైలా ఆడ బిడ్డను ప్రసవించింది. 108 అంబులెన్స్ సిబ్బంది కన్నన్, డ్రైవర్ వడివేల్ తల్లి లైలాకు, శిశువుకు ప్రాథమిక చికిత్స చేసి, సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తల్లి, బిడ్డ సురక్షితంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment