24న తెరపైకి కుటుంబస్తన్
తమిళసినిమా: గుడ్ నైట్ చిత్రం ఫ్రేమ్ మణికంఠన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కుటుంబస్తన్ . నటి శాన్వి నాయకిగా నటించిన ఈ చిత్రంలో గురు సోమసుందరం, జాన్సన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాకారన్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేశ్వర్ కాళీస్వామి దర్శకత్వం వహించారు. సుజిత్ సుబ్రమణియన్ చాయాగ్రహణం, వైశాక్ పాటలు, సంగీతాన్ని అందించిన కుటుంబస్తన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 24వ తేదీన విడుదల సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్తరేటు శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ఆడియో, ట్రైలర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వినోద్ కుమార్ మాట్లాడుతూ చిత్రం చాలా బాగా వచ్చిందని, ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నామని చూసి చెప్పండి అంటూ పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తన కలను నెరవేర్చుకోవడానికి ఆదరణను అందించిన తన కుటుంబానికి కృతజ్ఞతలు అన్నారు. చిత్ర కథానాయకుడు మణికంఠ మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల క్రితం దర్శకుడు ఈ చిత్ర కథలు చెప్పారన్నారు. తాను ఇంతకు ముందు నటించినా గుడ్ నైట్, లవర్ చిత్రాలను అంగీకరించడంతో ఎలాగైనా ఈ చిత్రంలో నటించాలని కోరుకున్న దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్నారు.
కాగా దర్శకుడు రాజేశ్వర్ ముందుగా ఒక ఎడ్వెంచర్ కథను రాయాలని భావించారని, ఆ తర్వాత ప్రస్తుత కాలంలో ఒక కుటుంబ బాధ్యతలను మోయడమే అడ్వెంచర్ కావడంతో ఈ కథను రాశారన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు పలు రకాలుగా కనెక్ట్ అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కుటుంబస్తం చిత్రంలో అందరూ చాలా బాగా నటించారని ఈ చిత్రం కోసం తనకు కొంగు తమిళ భాషలో నక్సలైట్స్ టీమ్ శిక్షణ ఇచ్చినట్లు, అదేవిధంగా రచయిత ప్రసన్న చాలా విషయాలు చెప్పారని నటుడు మణికంఠన్
పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment