ఆనందింపజేస్తుంది..ఆలోచింపజేస్తుంది
తమిళసినిమా: దర్శకుడు పా రంజిత్ కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అరుణ్ బాలాజీకు చెందిన బెలూన్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రం బాటిల్ రాధా. నవ దర్శకుడు దినకరన్ శివలింగం కథ ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. నటుడు గురు సోమ సుందరం ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి సంజన, జాన్ విజయ్, మారన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు వెట్రిమారన్, అమీర్, మిష్కిన్, లింగుస్వామి మొదలగు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ మద్యం వ్యసనం కారణంగా పలు కుటుంబాలు బాధింపుకు గురికావడం తాను కళ్లారా చూసానన్నారు. ఈ కథ స్క్రిప్టును దర్శకుడు దినకర్ తనకు ఇచ్చినప్పుడు అందులోని యదార్థత తనను ఆకట్టుకుందన్నారు సంభాషణలు, జీవనం మనకు చాలా సన్నిహితంగా ఉన్నాయ్ అనిపించిందన్నారు. చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరపై ఆవిష్కరించాలని ప్రశ్నించారు. వరుసగా ఇలాంటి తమిళ సినిమాకు కావలసిన చిత్రాలను అందించాలన్నదే నీలం ప్రొడక్షన్‌న్స్ ఆలోచన అని అన్నారు. బాటిల్ రాదా చిత్రం మిమ్మల్ని అలరించడంతోపాటు, అవగాహన కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ చాలా చక్కగా అందంగా రూపొందించిన చిత్రం బాటిల్ రాదా అని పేర్కొన్నారు. ఈ చిత్రం తొలి భాగం ఆనందింపజేస్తుందని, రెండవ భాగం ఆలోచింపజేస్తుందన్నారు. అదే సమయంలో సమకాలీన కాలానికి, ముఖ్యంగా ఆడిక్షన్‌కు గురౌతున్న ఈ సమాజానికి చాలా అవసరమైన చిత్రం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment