వణంగాన్‌లో సూర్య నటిస్తే.!
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు బాల అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. సమాజాన్ని సమస్యలను కొత్త కోణంలో తెరపై ఆవిష్కరించే దర్శకుడు ఈయన. ఆయన తాజాగా రూపొందించిన చిత్రం వణంగాన్. ది హౌస్ ప్రొడక్షనన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించిన ఈ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్, నటి రోషిని జంటగా నటించారు అరుణ్ విజయ్ కో చెల్లెలిగా రీతా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, శ్యామ్.సియస్ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా విడుదలై మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఆదివారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో థాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కామాక్షి మాట్లాడుతూ ఒక చిత్రం పూర్తిగా కథానాయకుడిని మూగవాడిగా నటించగలడు అంటే ఆ ఘనత దర్శకుడు బాలాకే దక్కుతుందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటి వణంగాన్ చిత్రాన్ని ప్రేక్షకుల చెంతకు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు అరుణ్ విజయ్ మాట్లాడుతూ చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయి అని పేర్కొన్నారు ఒక చిత్రాన్ని పూర్తిగా మాట్లాడకుండా నటించే కథానాయకుడిగా ప్రేక్షకులకు దగ్గర కాగలననే నమ్మకాన్ని కలిగించిన దర్శకుడు బాలాకు ధన్యవాదాలన్నారు. చిత్ర దర్శకుడు బాల మాట్లాడుతూ ధన్యవాదాలు అనే మాట చెప్పేస్తే చాలదని, అంతగా మీరు ఈ చిత్రాన్ని ఆస్వాదించి ఈ స్థాయికి చేర్చారని అన్నారు. మాట్లాడే మాట్లాడే అన్ని విషయాలను అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తున్న ఈకాలంలో మాట్లాడకుండానే అర్థమయ్యేలా చెప్పాలన్న ఓ ప్రయత్నమే ఈ చిత్రం అని చెప్పారు. అరుణ్ విజయ్ నటించిన ఈ చిత్రంలో నటుడు సూర్య నటిస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని భావిస్తున్నారో? అన్న ప్రశ్నకు ఈ చిత్రాన్నే హిట్ చేశారుగా అని బాలా బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment