వేడుకగా
స్వయంవర కార్యక్రమం
తిరువొత్తియూరు: వన్నియర్ మహాసభ , క్షత్రియ కళ్యాణ వేదిక నెలవారి సంచిక సంయుక్తంగా కొన్ని సంవత్సరములుగా వన్నియర్ స్వయంవరం కార్యక్రమం జరుపుతోంది. ప్రస్తుతం ప్రజల కోరిక మేరకు ఈ సంవత్సరము నుంచి అన్ని కులస్తులు, మతస్తుల వారికి స్వయవరం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం సైదాపేట, పిళ్ళయార్ ఆలయ వీధిలో ఉన్న శ్రీ గోకుల కృష్ణ వివాహ మండపంలో ఉదయం 10 గంటల నుంచి జనరల్‌గా అన్ని కులముల వారికి మధ్య వివాహ స్వయంవరం, 2 గంటల నుంచి వన్నియర్ కులస్తుల వారికి స్వయంవరం కార్యక్రమం జరిగింది. ఇందులో ఎలాంటి ఫీజులు తీసుకోలేదు. ఈ స్వయంవరం కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి పాల్గొన్నారు ఇందుకోసం ఏర్పాటులను క్షత్రియ స్వయంవరం విభాగం, పత్రిక సంచాలకులు, ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి పర్యవేక్షించారు.
సైన్స్ టీచర్లకు
బోధన విధానంపై శిక్షణ
తిరువొత్తియూరు: తమిళనాడు స్టేట్ బోర్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైన్నె ప్రెసిడెన్షి కళాశాల సంయుక్తంగా చైన్నె జిల్లా గల పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్లకు బోధన విధానంపై శిక్షణ ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు ప్రెసిడెన్షి కళాశాలలో నిర్వహించనున్నారు. ఇందుకోసం కళాశాల జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఫైనాన్స్), కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రామన్ అధ్యక్షత వహిస్తారు. చైన్నె యూనివర్సిటీ దూరవిద్య సంచాలకులు డాక్టర్ ఎస్.అరవిందన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఇందులో 50 మందికి పైగా సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొని శిక్షణ తీసుకోనున్నట్టు శిక్షణ సమన్వయకర్తలు తెలిపారు.
22 సవర్ల నగలు చోరీ
సేలం: కన్యాకుమారి జిల్లా కొల్లంకోడు మనలిక్కరై ప్రాంతానికి చెందిన మిలటరీ వీరుడు అజిత్ కుమార్ (47). ప్రస్తుతం ఈయన అండమాన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల కారణంగా గత పది రోజుల క్రితం ఈయన భార్య, పిల్లలు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ స్థితిలో శనివారం రాత్రి వాళ్లు ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. తర్వాత లోపలికి వెళ్లి చూడగా ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని చెల్లాచెదరుగా పడి కనిపించాయి. బీరువాలలో ఉన్న 22 సవర్ల బంగారు ఆభరణాలు చోరికి గురైనట్టు తెలిసింది. దీనిపై వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దొంగల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment