![భారీ బడ్జెట్‌తో కెప్టెన్ అమెరికా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07cni02-300105_mr-1738982599-0.jpg.webp?itok=d2nUGg6x)
భారీ బడ్జెట్‌తో కెప్టెన్ అమెరికా
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రాలంటేనే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది. అదీ మార్వెల్ సంస్థ నుంచి చిత్రం వస్తుందంటే మరింత ఆసక్తి ఉంటుంది. అలా ఇంతకు ముందు వచ్చిన కెప్టెన్ అమెరికా పేరుతో వచ్చిన నాలుగు ఫ్రాంచైజ్ పెద్ద విజయాన్ని సాధించాయి. తాజాగా వస్తున్న మార్వెల్ కామిక్స్ 5వ ఫ్రాంచైజ్ చిత్రం కెప్టెన్ అమెరికా.. బ్రేవ్ న్యూ వరల్డ్. జూలియస్ ఓనా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హారిసన్ ఫోర్డ్, ఆంథోని మ్యాకీ, సేథ్ రోలిన్స్, రోసా సలాజర్, డానీ రావిరెంజ్, షీరా హాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ భారీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రం ఇది. అమెరికాలో కొత్త అధ్యక్షుడు ఎంపికై న తరువాత ఆ దేశంలో పెద్ద సమస్య ఉందన్న విషయాన్ని కనుగొంటారు.అదేమిటి? దాన్ని ఎలా పరిష్కరించారు అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గత చిత్రాలకంటే భారీ బడ్జెట్‌లో, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లు విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచారన్నారు. మార్వెల్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, ఇంగ్లిష్, హిందీ ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment