పడూర్‌లో రైఫిల్ క్లబ్
● ప్రారంభించిన మాజీ డీజీపీ
సాక్షి, చైన్నె: పడూరులోని హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రైఫిల్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు రైఫిల్ షూటింగ్‌లో రాణించాలన్న లక్ష్యంతో క్లబ్‌ను ఏర్పాటుచేశారు. దీనిని ఈ విద్యా సంస్థ పూర్వ విద్యార్థి, మాజీ డీజీపీ శైలేంద్రబాబు ప్రారంభించారు. హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ హాజరయ్యారు. కొత్తగా స్థాపించిన రైఫిల్ క్లబ్ విద్యార్థులలో క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా, సురక్షితమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లుచేశారు. అనుభవజ్ఞులైన కోచ్‌లతో పర్యవేక్షణలో విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు. డాక్టర్ సి. శైలేంద్ర బాబు మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థులు రాణించాలని, నైపుణ్యాలను కృషి, క్రమశిక్షణతో నేర్చుకోవాలని, లక్ష్యసాధనలో ముందుండాలని పిలుపునిచ్చారు. డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ మాట్లాడుతూ, తమ విద్యార్థులకు సమగ్ర విద్యను అందించడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రారంభోత్సవంలో విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. షూటింగ్ క్రీడల్లో భారతదేశ గొప్ప వారసత్వం, ప్రేరణ గురించి ఈసందర్భంగా వివరించారు. అలాగే, షూటింగ్‌లో రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment