![క్రీడాకారులకు తోడ్పాటు!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07cni30-600560_mr-1738982640-0.jpg.webp?itok=fWA_7YVf)
క్రీడాకారులకు తోడ్పాటు!
సాక్షి, చైన్నె: క్రీడాకారులకు తోడ్పాటు అందించే విధంగా డిప్యూటీ సీఎం ఉదయనిఽధి స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరగనున్న పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారు. తమిళనాడు చాంపియన్స్ ట్రస్ట్ నిధుల నుంచి చెక్కును శుక్రవారం అందజేశారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీలు మార్చి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ పోటీల నిమ్తితం తమిళనాడు నుంచి 16 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. వీరికి ఢిల్లీ వెళ్లి వచ్చేందుకు ఆర్థిక సహకారంగా ఒక్కొక్కరికి రూ.65 వేలు అందజేశారు. అలాగే, ఫెన్సింగ్ ఫెడరేషన్(ఎఫ్‌ఐఈ) ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు కజకిస్తాన్‌లో నిర్వహించనున్న జూనియర్ ఫెన్సింగ్ ప్రపంచ కప్ పోటీలకు తమిళనాడు అథ్లెట్ బ్లెస్సిలా సంగ్మా, పి.అరవిందన్ ఎంపికయ్యారు. కజకిస్తాన్ వెళ్లి రావడానికి ఆర్థిక సహకారంగా ఈ ఇద్దరికి తలా రూ. 3.15 లక్షలు చెక్కులను అందజేశారు. మొత్తం 18 మంది క్రీడాకారులకు రూ. రూ.16.70 లక్షలను తమిళనాడు చాంపియన్స్ ట్రస్ట్ నిధి నుంచి అందజేశారు. అలాగే, గత నెల 24 నుంచి 27వ తేదీ వరకు లడాక్ లేహ్ నగరంలో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జరిగాయి. ఇందులో తమిళనాడుకు చెందిన ఐదుగురు పతకాలను సాధించారు. తాము సాధించిన పతకాలను డిప్యూటీ సీఎంకు అందజేసి క్రీడాకారులు ఆశీస్సులు అందుకున్నారు. ఖేలో ఇండియా పోటీలలో తమిళనాడు నుంచి పాల్గొన్న 11 మంది క్రీడాకారులకు రూ.7.05 లక్షలను అందజేశారు. క్రీడల శాక కార్యదర్శి అతుల్య మిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ సీఈఓ ,సభ్య కార్యదర్శి జె.మేఘనాథరెడ్డి, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ట్రైనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment