21న తెరపైకి డ్రాగన్‌ | - | Sakshi
Sakshi News home page

21న తెరపైకి డ్రాగన్‌

Published Sat, Feb 8 2025 8:36 AM | Last Updated on Sat, Feb 8 2025 8:36 AM

21న తెరపైకి డ్రాగన్‌

21న తెరపైకి డ్రాగన్‌

తమిళసినిమా: కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై హిట్‌ కొట్టిన దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌. ఆ తరువాత లవ్‌ టుడే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నారు. కాగా ప్రదీప్‌ రంగనాథన్‌ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్‌. ఈ చిత్రానికి ఓమై కడవులే చిత్రం ఫేమ్‌ అశ్వంత్‌ మారిముత్తు దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్‌, కై రా లోహర్‌ నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. కాలేజీ నేపథ్యంలో దర్శకుడు అశ్వంత్‌ మారిముత్తు ఈ చిత్రాన్ని సరికొత్త కథనంతో తెరకెక్కించారు. ఇందులో కళాశాల విద్యార్థుల ర్యాగింగ్‌, కాలేజీ విద్య పూర్తి అయిన తరువాత వారి జీవితంలో ఎదుర్కొనే సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌ వంటి పలు అంశాలు చోటుచేసుకుంటాయని ప్రదీప్‌ రంగనాథన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటుడు శింబు బ్రేకప్‌ అంటూ సాగే పాటను పాడడం విశేషం. దీనికి లియోన్‌ జేమ్స్‌ సంగీతాన్ని అందించారు. ఈచిత్రాన్ని ఈనెల 21వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తరువాత దర్శకుడు అశ్వంత్‌ మారిముత్తు శింబు హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement