![క్లుప](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07cni11-300107_mr-1738982601-0.jpg.webp?itok=Iase33QD)
క్లుప్తంగా
ఎస్‌ఆర్‌ఎంలో
అంతర్జాతీయ సదస్సు
కొరుక్కుపేట: ఎస్‌ఆర్‌ఎం మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ – ఎంబీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సును శుక్రవారం నిర్వహించారు. స్థానిక వడపలని ఎస్ ఆర్‌ఎం క్యాంపస్‌లో జరిగిన ఈ సదస్సులో 317 మందికి పైగా పాల్గొని తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నాలుగు సంస్థలు ప్రఖ్యాత సంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మలేషియా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రేమ్‌కుమార్ రాజగోపాల్, ఎన్‌ఎస్‌ఈ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వినోద్ జేమ్స్, కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి శోభా వేణుగోపాల్, ఆడాసియస్ డ్రీమ్స్ ఫౌండేషన్ నుంచి దినేష్ గజేంద్రన్ సంతకాలు చేశారు. ఎస్‌ఆర్‌ఎం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.పొన్నుసామి, వడపళని మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ వి.శశిరేఖ, సిక్కి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అంపా పళనియప్పన్ పాల్గొన్నారు.
ఉత్తరాది కార్మికుడి హత్య
– స్నేహితుడి అరెస్టు
సేలం: బిహార్‌కు చెందిన శంకర్ సరోజ్ కుమారుడు అనిగేట్ (25). ఇతని స్నేహితుడు ఢిల్లీ సాలిమార్క్ లేకియా కేమ్ ప్రాంతానికి చెందిన ఉపేంద్ర (24). వీరిద్దరు తెన్‌కాశి జిల్లా కడయనల్లూర్ సమీపంలో ఉన్న సొక్కంపట్టి సమీపంలోని పున్నయాపురం ముందల్ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రైవేటు రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య పని విషయంగా గొడవ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ స్థితిలో గురువారం రాత్రి ఎప్పటిలాగే పని ముగించుకుని రైస్ మిల్లు వద్ద బస చేసే గదికి వెళ్లారు. అక్కడ వారిద్దరు వంట చేస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆవేశం చెందిన ఉపేంద్ర కూరగాయలు నరికే కత్తితో అనిగేట్‌ను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అనిగేట్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న సొక్కంపట్టి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం నెల్లైప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపేంద్రను అరెస్టు చేసిన పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.
![క్లుప్తంగా1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07cni24-300102_mr-1738982601-1.jpg)
క్లుప్తంగా
Comments
Please login to add a commentAdd a comment