![దివ్యాంగులకు ప్రత్యేక శిబిరాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07cni09-300096_mr-1738982601-0.jpg.webp?itok=b21dfxA8)
దివ్యాంగులకు ప్రత్యేక శిబిరాలు
వేలూరు: జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరులోని టౌన్ హాలులో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం తాలుకా స్థాయిలో శిబిరాలు నిర్వహించి అర్హులైన వారికి ప్రభుత్వాస్పత్రి వైద్యులతో గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు పాసులు, పెన్షన్‌లు వంటి సంక్షేమ పథకాలను ఇక్కడికక్కడే అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని శాఖలకు చెందిన అధికారులున్నారని అర్హులైన వారికి ఆయా శాఖల నుంచి సంక్షేమ ఫలాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా అభివృద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి శరవణన్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment