TS High Court: దసరా వరకు ఆపుతారా.. లేదా?  | Telangana High Court: Land Auction Issue In Hyderabad | Sakshi
Sakshi News home page

TS High Court: దసరా వరకు ఆపుతారా.. లేదా?

Published Wed, Sep 15 2021 9:00 AM | Last Updated on Fri, Sep 17 2021 12:14 PM

Telangana High Court: Land Auction Issue In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా  పుప్పాలగూడలోని సర్వే నంబర్‌ 301, 303, 327ల్లోని 18 ఎకరాల భూమి హక్కులపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. దసరా సెలవుల వరకు ఈ భూమి వేలం వేయకుండా ఆపుతారో.. లేదో.. ప్రభుత్వాన్ని అడిగి చెప్పాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను హైకోర్టు ఆదే శించింది. ఈ భూమిపై తమకు హక్కు లున్నాయని పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారించింది.

ఈ భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని, వేలం ప్రక్రియ నిలిపివేయాలని పిటిషన్ల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈ భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని పేర్కొనేందుకు ఆధారాలు లేవని ఏజీ వెల్లడించారు. దీనికి స్పందించిన ధర్మాసనం... లోతుగా విచారణ చేయాల్సి ఉందని, వేలం ఆపే అవకాశం ఉందో.. లేదో.. గురువారంలోగా చెప్పాలని ఏజీకి సూచిస్తూ విచారణను 16కు వాయిదా వేసింది.

చదవండి: ‘మంత్రి కేటీఆర్‌ ఒక అజ్ఞాని’.. ఆయన సవాల్‌ నేను స్వీకరించడమేంటీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement