అధికారంతో తమ్ముళ్ల అరాచకం
చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. రైతుల భూముల్లోని పంటలను సైతం నాశనం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఆరు నెలల క్రితం కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం చదువుపై దృష్టి సారించలేకపోయింది. పిల్లలకు పౌష్టికాహారం నుంచి.. సాంకేతిక విద్యవరకు అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేసింది. పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోనీయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఇదిచాలదన్నట్టు ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పరోక్షంగా కార్పొరేట్‌కు ఎరతివాచీ పరుస్తోంది. విద్యార్థులకు అమలుకావాల్సిన తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన వంటి పథకాలను పక్కన పెట్టేసింది. 8వ తరగతి విద్యార్థులకు ఇవ్వాల్సిన ట్యాబులకు పూర్తిగా మంగళం పాడేసింది. పాఠశాలల్లో మౌలిక వసతులను విస్మరిస్తూ చుక్కలు చూపిస్తోంది. ఇటు ప్రభుత్వ విద్యారంగాన్ని, అటు విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులపై పెనుభారం మోపుతోంది.
–IIలో
–IIలో
Comments
Please login to add a commentAdd a comment