వికారాబాద్: నగరంలోని సచివాలయంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రేషన్‌కార్డుల మంజూరు, ఆరు గ్యారంటీల అమలుపై చర్చించారు. అనంతరం కలెక్టర్ సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 28నుంచి వచ్చేనెల(జనవరి) 6వ తేదీ వరకు జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలానికి రెండు టీంలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక టీమ్‌కు తహసీల్దార్, మరో టీమ్‌కు ఎంపీడీఓ లీడర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలోని 20 మండలాల్లో 40 టీమ్‌లు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభు త్వం అమలు చేసే ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అలాగే కొత్త రేషన్ కార్డులు, అభయహస్తం కార్డుల కోసం అర్జీలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment