హామీలు నెరవేర్చాలి
దోమ: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జిల్లా ఎన్‌పీఆర్‌డీ అధ్యక్షుడు దశరథ్ డిమాండ్ చేశారు. బుధవారం దోమ మండల పరిధిలో బాస్‌పల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు. రూ.6 వేల పెన్షన్ నేటికి అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. నేటికి 11 నెలలు గడుస్తున్నా దివ్యాంగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందన్నారు. రాష్ట్రంలో పెన్షన్ పెంపు కోసం 44,49,787 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారన్నారు. కొత్తగా మరో 24,84,000 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికి, వారికి ఇంకా మంజూరు చేయలేదని మండిపడ్డారు. ప్రతి దివ్యాంగుడికి ఉచిత బస్‌పాస్, వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ప్రతి నెల 5వ తేదీ లోపు పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా అమలు చేస్తున్న మహిళా శక్తి క్యాంటీన్‌లలో తమకు 5శాతం కేటాయించేలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నేతలు రాజు, వెంకటయ్య, గోపాల్, మొగులయ్య, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌పీఆర్‌డీ అధ్యక్షుడు దశరథ్
Comments
Please login to add a commentAdd a comment