సమగ్ర సర్వేకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర సర్వేకు సహకరించండి

Published Thu, Nov 21 2024 8:04 AM | Last Updated on Thu, Nov 21 2024 8:04 AM

సమగ్ర సర్వేకు సహకరించండి

సమగ్ర సర్వేకు సహకరించండి

పరిగి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు అధికారులకు నిర్భయంగా సమాచారాన్ని అందించాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో సర్వేలో పాల్గొని కుటుంబ వివరాలను అధికారులకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు తెలుస్తాయన్నారు. గతంలో ఎన్నో సర్వేలు నిర్వహించగా ఇంత పకడ్బందీగా లేవని అన్నారు. ఈ సర్వేలో పూర్తి సమాచారం ఉందని కావున ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ వివరాలను ఎన్యుమరేటర్లకు తెలపాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం ఎల్లప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్వే అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement