జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు రాకేశ్
పరిగి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు పరిగి నంబర్ వన్ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి రాకేశ్ ఎంపికయ్యారు. మంగళవారం ఎంఈఓ గోపాల్ విద్యార్థిని అభినందించారు. ఇటీవల మెదక్‌లో జరిగిన అండర్ –14 బాలుర విభాగంలో నిర్వహించిన 68వ రాష్ట్రస్థాయి వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా రన్నరప్‌గా నిలిచింది. ఈ జట్టులో ఉన్న రాకేశ్‌ను రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేశారు. డిసెంబర్ 10 నుంచి వారణాసిలో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పీడీ ఖాజా, ప్రవీణ్, ఇసాక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బృహదీశ్వర్ ఎంపిక
కుల్కచర్ల: మండలంలోని ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్‌కి చెందిన 9వ తరగతి విద్యార్థి బృహదీశ్వర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. సోమవారం మెదక్‌లో జరిగిన అండర్ –14 బాలుర విభాగం వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మంగళవారం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి బృహదీశ్వర్‌ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిభా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆలన కేంద్రం సందర్శన
అనంతగిరి: అనంతగిరి గుట్టలోని ఆలన (పాలేటివ్ కేర్ సెంటర్) కేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్‌ఓ వెంకటరవణ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. ఈ కేంద్రంలో కేన్సన్, పక్షవాతం, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడే వారికి సేవలు అందిస్తామని తెలిపారు. ఆయన వెంట ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ నిరోషా, రేణుకుమార్, జయరాం, సెంటర్ డాక్టర్ వాహబ్, డాక్టర్ సుప్రియ ఉన్నారు.
ఘన నివాళి
అనంతగిరి: దేశ మొదటి మహిళా ప్రధాని, స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఘన నివాళి అర్పించారు. వికారాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్‌నాయక్, చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, ముత్తాహర్ షరీఫ్, గంగులు తదితరులు పాల్గొన్నారు.
అనంతుడి సేవలో కొండా
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో వెలసిన అనంతపద్మనాభ స్వామిని మంగళవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా అనంతగిరి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆలయానికి సంబంధించిన పలు సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment