రైతులు ముందుకు రావాలి
అనంతగిరి: ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యాన శాఖ, ఇకోపామ్ ఆయిల్ అండ్ ఫట్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగుపై జిల్లాస్థాయి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట ఆవశ్యకత, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు గురించి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, శాస్త్రవేత్తలు, అధికారులు విజయన్, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్లు వినియోగించాలి
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వాడాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. మంగళవారం ప్రపంచ టాయిలెట్ డేను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిఽశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరుగుదొడ్లు లేని వారు నిర్మించుకోవాలన్నారు. పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో డిసెంబర్ చివరి నాటికి టాయిలెట్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ వెంకటరవణ, డీడబ్ల్యూ కృష్ణవేణి, డీపీఓ జయసుధ, పీఆర్ ఈఈ ఉమేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment