ఎదురెదురుగా స్కూటీ, డీసీఎం ఢీ
వ్యక్తికి తీవ్ర గాయాలు
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై సోమవారం అంగడి చిట్టెంపల్లి బస్ స్టేజీ వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న స్కూటీ, డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూపీ రాష్ట్రానికి చెందిన రాజు అనే వ్యక్తి చేవెళ్ల మండలం అంతారం సమీపంలోని ఆర్గాన్ విల్లాస్‌లో పని చేస్తున్నాడు. వ్యక్తిగత పని నిమిత్తం చేవెళ్ల వెళ్లిన ఆయన తిరిగి వస్తుండగా అంగడి చిట్టెంపల్లి గేటు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం స్యూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నగరానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment