ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
● కలెక్టర్ ప్రతీక్‌జైన్ ● ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 2కే రన్‌లో పాల్గొన్న జిల్లా స్థాయి అధికారులు
అనంతగిరి: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎన్నేపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2కే–రన్ ఏర్పాటు చేశారు. ఈ రన్‌ను కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారయణరెడ్డి, అదనపు కలెక్టర్‌లు లింగ్యానాయక్, సుధీన్ మున్సిపల్ చైర్మన్ మంజుల ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. విజయోత్సవాల్లో ప్రతీ ఒక్క రు భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు రోజు వ్యా యామం చేయాలని సూచించారు. ఈ రన్‌లో డీఆర్‌డీఏ శ్రీనివాస్, డీవైఎస్‌ఓ హనుమంతరావు, డీటీడీఓ కమలాకర్ రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.
నాణ్యత తప్పనిసరి
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేపడుతున్న పనుల్లో నాణ్యత తప్పక పాటించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్‌లోని రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో నిర్మించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రారంభం చేయనున్న క్రమంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ గదులను పరిశీలించారు. అనంతరం అనంతగిరిగుట్టలో నిర్మించిన సమీకృత ఆయుష్ వైద్యశాలను పరిశీలించారు. వైద్యశాల ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణానికి అంచనాలను సమర్పించాలని టీజీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌ఓ వెంకటరవణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఉన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
కొడంగల్: కొడంగల్‌లో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాల కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. మంగళవారం ఆయన పట్టణంలోని సమీకృత బాలికల వసతిగృహ సముదాయం ఆవరణలో తాత్కాలికంగా నిర్వహించే నర్సింగ్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. మౌలిక వసతుల ఏర్పాటుతో పాలుగా కావాల్సిన మరమ్మతులు చేపట్టాలన్నారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న సెంట్రలైజ్‌డ్ కిచెన్ షెడ్‌ను పరిశీలించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే వంటశాలను కలెక్టర్ సందర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం పూట ఉచితంగా నాణ్యమైన అల్ఫాహారం అందించనున్నారు. త్వరలో కిచెన్ షెడ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర ప్రసాద్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ ఉషశ్రీ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, డీఈ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment