అభివృద్ధికి నిధుల వరద
ఏడాదిలో నియోజకవర్గానికి రూ.650 కోట్లు
● ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.350 కోట్లు ● ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు వెళ్తున్నాం ● విద్య, వైద్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి ● రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తే ఎమ్మెల్యేగా సక్సెస్ అయినట్లే ● ‘సాక్షి’తో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
‘ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడంలో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచింది.. నియోజకవర్గ అభివృద్ధి .. పారిశ్రామికవాడ నెలకొల్పడమే లక్ష్యం అంటున్నారు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి (బీఎంఆర్). రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన నేపథ్యంలో.. చేపట్టిన పనులు.. భవిష్యత్తు ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – తాండూరు
ప్రశ్న: నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు ఎంత మేర నిధులు వచ్చాయి?
జవాబు: ఏడాది కాలంలో కొత్తగా రూ.650 కోట్ల నిధులను తీసుకొచ్చా. గత ప్రభుత్వం జీవోలు కాగితాలకే పరిమితమయ్యాయి. తాను ఎమ్మెల్యేగా నిధులు మంజూరు, అడ్మినిస్ట్రేషన్, టెండర్లు పూర్తి చేయించాం.
ప్రశ్న: రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా చేపట్టారా?
జవాబు: దశాబ్ధకాలంగా రోడ్లన్నీ పాడయ్యాయి. తాండూరు–హైదరాబాద్ మార్గం గుంతలమయంగా ఉంటే ఇప్పటికే అవి లేకుండా చేశాం. నాలుగు లైన్ల విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో రూ.120 కోట్లు మంజూరు చే యించాం. నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రో డ్లకు మరో రూ.వంద కోట్లు మంజూరయ్యా యి. తాండూరు–చించోళి రోడ్డు విస్తరణకు రూ.25కోట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.350కోట్ల వరకు టెండర్లు పూర్తయ్యాయి.
ప్రశ్న: చిలుక వాగు ప్రక్షాళన ఎంతవరకు జరిగింది?
జవాబు: రూ.పది కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇటీవలే ఇద్దరు మంత్రులు పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రశ్న: గొల్ల చెరువును అభివృద్ధి చేస్తారా?
జవాబు: గత ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించిఅంసంపూర్తిగా పనులు వదిలేశారు. చెరువు అభివృద్ధికి రూ.4కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నాం.
ప్రశ్న: పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఎంత వరకు వచ్చింది?
జవాబు: రైల్వే శాఖ మంత్రిని పనులు సాగించేందుకు అనుమతులు పొందాం. మార్చిలో పనులు ప్రారంభించాం. రోడ్డు పక్కన ఇళ్లు ఉన్న ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సమ స్యను సామరస్యంగా పరిష్కరించి పను లు ప్రారంభిస్తాం.
ప్రశ్న: బైపాస్ రోడ్డు ఎన్నికల హామీలకే పరిమితమా?
జవాబు: ప్రసాద్‌కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో తాండూరు బైపాస్ రోడ్డు మంజూరయింది. తర్వాత బీఆర్‌ఎస్ పదేళ్లు పాలించి విఫలమైంది. ప్రస్తుతం భూ సేకరణకు వచ్చిన అవాంతరాలను కొలిక్కి తీసుకువచ్చి వేగం పెంచాం.
ప్రశ్న: కంది బోర్డు ఏర్పాటు ఎప్పుడు?
జవాబు: ముఖ్యమంత్రి కంది బోర్డు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే కేంద్రం ప్రభుత్వ ప్రతినిధులను కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతాం.
ప్రశ్న: లారీ పార్కింగ్ లేక ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి కదా?
జవాబు: లారీ పార్కింగ్ ఏర్పాటుకు ఇప్పటికే ట్రాన్స్‌పోర్ట్ అసోషియేషన్ ప్రతినిధులతో చర్చించాం. స్థల సేకరణ పూర్తయింది. లారీ పార్కింగ్ ప్రాంగణ అభివృద్ధిని టీఎస్‌ఐఐసీ అభివృద్ధి చేయనుంది. ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులకు షాపులను కేటాయించేందుకు ఒక్కో దుకాణానికి రూ.12 లక్షలు చెల్లించాలని టీఎస్‌ఐఐసీ నిర్ణయించింది. త్వరలోనే పనులకు శ్రీకారం చుడతాం.
ప్రశ్న: పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది?
జవాబు: ఏడాది కాలంలో పట్టణంలో నాపరాతి పాలిషింగ్ యూనిట్‌లను పారిశ్రామిక వాడలోకి తరలించేలా కృషి చేస్తాను.
ప్రశ్న: బషీరాబాద్ మండలంలో ఎత్తిపోతల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తారా?
జవాబు: ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు అందించేందుకు టీఎస్‌ఐడీసీ అధికారులతో సర్వే చేయించాం. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం.
ప్రశ్న: కోట్‌పల్లి, జుంటిపల్లి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయా?
జవాబు: కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధికి నీటిపారుదల శాఖ అధికారులతో నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించి ప్రభుత్వానికి సమర్పించాం. ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిధులు మంజూరు చేయనున్నారు. మరోవైపు జుంటిపల్లి ప్రాజెక్టు కెనాల్ కాల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నాలుగు నెలల క్రితం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు జుంటిపల్లి ప్రాజెక్టు సందర్శించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. యాలాల మండలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన శివసాగర్ ప్రాజెక్టు పనులను సైతం పూర్తి చేస్తాం.
ప్రశ్న: ప్రజారోగ్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: పారిశుద్ధ్య నిర్వాహణ సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించాం. తాండూరులో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆస్పత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. బషీరాబాద్ మండల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులతో పాటు 24 మంది స్టాఫ్‌నర్స్‌లను నియమించాం.
ప్రశ్న: కర్ణాటక సరిహద్దులో రవాణా వ్యవస్థతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటవీ భూ వివాదం పరిష్కారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
జవాబు: అంతరాష్ట్ర సరిహద్దులో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రణాళిక తయారు చేశాం. వారం క్రితమే కర్ణాటక రాష్ట్ర మంత్రి శరణుప్రకాష్‌పాటిల్‌తో కలిసి ఇరు రాష్ట్రాల సరిహద్దులో రవాణా వ్యవస్థను మెరుగు పర్చేందుకు సయోధ్య కుదిరింది. నవాంద్గి నుంచి నిడుగుంద వరకు రోడ్డు పనులు ప్రారంభించాం. ఇందర్‌చెడ్–కురుగుంట, మైల్వార్–అడ్కి మార్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తాం.
ప్రశ్న: నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు మంజూరయ్యాయి?
జవాబు: రూ.650 కోట్ల వరకు నిధులు తీసుకువచ్చాం.
ప్రశ్న: తాండూరు వ్యవసాయ నూతన మార్కెట్ యార్డు ఎప్పటి వరకు అందుబాటులోకి తీసుకొస్తారు..
జవాబు: వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాదిలో పనులు పూర్తి చేసి వ్యాపారులకు, రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
ప్రశ్న: విద్యావ్యవస్థ పటిష్టానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులను గుణాత్మకమైన విద్య అందించేందుకు అంకిత భావంతో కృషి చేస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం నుంచి ఐటీఐ కళాశాల ప్రారంభిస్తాం.
ప్రశ్న: ఏడాది పదవీ కాలంలో సంతృప్తినిచ్చిన అంశం?
జవాబు: తాండూరు–హైదరాబాద్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం.
ప్రశ్న: పార్టీలో ప్రాధాన్యత లేదనే విమర్శలు వస్తున్నాయి?
జవాబు: పార్టీలో అందరికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాం. పార్టీ కోసం పని చేసిన వారికి తప్పక ప్రాధాన్యత ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment