అనంతగిరి: వికారాబాద్ ప్రత్యేక జిల్లా కోసం జరిగిన ఉద్యమంలో ధారూర్ మండలం కెరెళ్లి వాసులపై పెట్టిన కేసుల విషయంలో మంగళవారం వికారాబాద్ అదనపు మొదటి తరగతి న్యాయస్థానంలో ఊరట లభించిందని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉద్యమకారుడు ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో పాటు జిల్లా సాధణ ఉద్యమంలో కెరెళ్లి వాసులు ముఖ్య పాత్ర పోషించారన్నారు. కేసులో కెరెల్లి వాసులైన జలంధర్‌రెడ్డి, ఆనంద్, బల్వంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మెతుకు కిష్టయ్య(చనిపోయారు), కావలి వెంకటయ్యలకు ఊరట లభించిందని ఆయన తెలిపారు.
రేపు డీఈఈ సెట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్
అనంతగిరి: ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలల్లో డీఈఈ సెట్ 2024–26లో కోర్సులో చేరే అభ్యర్థులకు గురువారం రెండో విడత సర్టిఫికెట్స్ వేరిఫికేషన్ ఉంటుందని వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రామాచారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 9వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. 13న సీట్లు కేటాయింపు, 17లోగా ఫీజు చెల్లించి అలాట్మెంట్ లెటర్‌తో సీటు వచ్చిన కళాశాలలో ఒరిజినల్ ధృవపత్రాలను సమర్పించాలన్నారు. కళాశాల బదిలీ కొరకు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు.
‘లగచర్ల’ బెయిల్ పిటిషన్ల తిరస్కరణ
● నిరాశలో బీఆర్‌ఎస్ లీగల్ సెల్‌న్యాయవాదులు
● నేడు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు..?
వికారాబాద్: లగచర్ల ఘటనకు సంబంధించి రెండు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి కేసులు నమోదైతే అవి ప్రత్యేక కోర్టులో మాత్రమే విచారించాలని 2024 మే నెలలో హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను అనుసరించి వికారాబాద్ జిల్లా కోర్టు ఈ పిటిషన్లను తిరస్క రించింది. నవంబర్ 11న అధికారులపై దాడి ఘటనలో 12వ తేదీ నుంచి వారం రోజుల పాటు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో పాటు గా కేసులో ఉన్న పలువురిని రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. ఇందుకు సంబంధించి 20 రోజులుగా బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు వికారాబాద్ జిల్లా కోర్టులో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. పీపీ, నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాగా పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. నరేందర్‌రెడ్డి బెయిల్ పిటి షన్‌పై ఈ నెల 5న వాదనలు జరగాల్సి ఉంది. మంగళవారం రైతులకు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి వాదనలు విన్న కోర్టు రెండు పిటి షన్లను తిరస్కరించింది. వారి బెయిల్ కో సం బుధవారం న్యాయవాదులు నాంపల్లి ప్రత్యేక కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
సీఎం చొరవతోనే ఫోర్‌వే
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పూడూరు: గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు తీరని అన్యాయం చేశారని.. ప్రాణహిత చేవెళ్లను పక్కదారి పట్టించారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని మన్నెగూడలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ముది రాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఆర్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, జిల్లా మంత్రులు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డు వేయలేకపోయారన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్‌జీఓలు చెట్లు నరకొద్దంటూ కేసులు పెట్టినా.. ప్రజల ప్రాణాలే ముఖ్య మని సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు పనుల ప్రారంభించాలని చెప్పారన్నారు. ఆయన చొరవతోనే ఫోర్‌వే పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. నవంబర్ 28 నుంచి రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే బీఆర్‌ఎస్ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వికారాబాద్‌లో నేవీ రాడార్,వికారాబాద్ క్రిష్ణా రైల్వే లైన్ ఏర్పాటుకు తమ ప్రభుత్వమే శ్రీకారం చుట్టిందని తెలిపారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం రూ.135కోట్లు చెల్లించిందన్నారు. జిల్లాకు ఏంచేశారని ప్రశ్నిస్తున్న నాయకులు పదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలన్నారు. రా ష్ట్రానికే గుండెకాయలా ఉన్న రంగారెడ్డి జిల్లా ను ముక్కలుగా చేశారన్నారు. ప్రాణహిత చేవె ళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరిట కొండ పోచమ్మ రిజర్వాయర్‌కు మల్లించి జిల్లా ప్రజలకు అన్యా యం చేశారన్నారు. ఈ సందర్భంగా ఆలూరు గేటు వద్ద జరిగిన ప్రమాద మృతులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల సతీశ్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శులు షకీల్, పెంటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, లాల్‌కృష్ణ ప్రసాద్, అజీంపటేల్, శ్రీని వాస్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment