మూసీ పునరుజ్జీవంతో అద్భుత ఫలితాలు
అనంతగిరి: మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తయితే అద్భుత ఫలితాలు వస్తాయని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాలలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమంతరావు వాటర్ కాన్సెప్ట్ – వికారాబాద్‌లో నీటి భద్రత, మూసీ నది పునరుజ్జీవం అనే అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మన జిల్లా మెట్ట ప్రాంతమని, వర్షాధార మైనర్ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు తప్ప మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవన్నారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 5.88 లక్షల ఎకరాలు ఉండగా.. ప్రాజెక్టులు, చెరువులు, బోర్లు, బావుల కింద సాగయ్యేది 1.57 లక్షలు మాత్రమే అన్నారు. మిగతాదంతా వర్షాధారమేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో జిల్లాలో కోట్‌పల్లి, నందివాగు, సర్పన్‌పల్లి వంటి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారని పేర్కొన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి జిల్లాలోని కొంత ప్రాంతానికి నీళ్లందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. మూసీ జన్మస్థానం అయిన మన జిల్లాలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందన్నారు. మూసీ పునరుజ్జీవం పనులు పూర్తయితే దీర్ఘకాల ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నిధులు, నియామకాలు, నీళ్ల కోసం జరిగిందన్నారు. ఉన్న నీటిని ఒక పద్ధతి ప్రకారం వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం ట్రస్టు కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, జల నిపుణులు నర్సింహారెడ్డి, డీపీ రెడ్డి, మహ్మద్ అఫ్సర్, సాయి సురేష్, హకీం, హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు మైపాల్‌రెడ్డి, బస్వరాజు, గోవర్ధన్‌రెడ్డి, మాధవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సదానందరెడ్డి, రమేష్‌కుమార్, కిషన్‌నాయక్, రఘపతిరెడ్డి, కేపీ రాజు, డాక్టర్ ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment