ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం

Published Thu, Nov 21 2024 8:04 AM | Last Updated on Thu, Nov 21 2024 8:04 AM

ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం

ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం

పహాడీషరీఫ్‌: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం సయ్యద్‌ పల్లి గ్రామానికి చెందిన సుకమెట్టి శివకుమార్‌, నందిని(24) దంపతులకు ఏడెళ్ల క్రితం వివాహం జరగగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఏడు నెలల క్రితం వీరు బతుకుదెరువు నిమిత్తం జల్‌పల్లి శ్రీరాం కాలనీకి వలస వచ్చారు. ఇదిలా ఉండగా నందిని ఇతరులతో తరచూ ఫోన్‌ మాట్లాడే విషయమై భార్యాభర్తల నడుమ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 18న శివకుమార్‌ డ్యూటీకి వెళ్లి రాత్రి 7 గంటలకు వచ్చి చూడగా, పెద్ద కుమార్తె అమ్మ ఇంట్లో లేదని ఏడుస్తూ కనిపించింది. కుమారుడు శ్రీజన్‌(4), కుమార్తె నయనిక(2)లతో పాటు ఆమెకు సంబంధించిన వస్తువులు, గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకొని ఇంటి నుంచి వెళ్లినట్లు గుర్తించాడు. శివ అనే ఆటోడ్రైవర్‌తో కలిసి వెళ్లి ఉంటుందన్న అనుమానంతో బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీరి ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement