కొనసాగుతున్న అఖండ భజన
వికారాబాద్ అర్బన్: అనంతగిరి కొండలపై కొలువైన అనంతపద్మనాభ స్వామి కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా అనంతగిరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా మండలి అఖండ భజనను తొమ్మిదోరోజు కూడా కొనసాగించారు. ఈ భజనలో 150 భజన బృందాలు పాల్గొన్నాయని సమన్వయ కర్తలు బాలరాజు, శిరీష, నాగభూషణం, నరేందర్‌రెడ్డి, దామోదర్, విజయలక్ష్మి, మాధవి పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన భజనలో దుద్యాల, మల్లెపల్లి, మొత్కూరు, సల్‌బత్తాపూర్, పీలారం, తాండూర్ భవానీ మండలి, కందనేల్లి, నారెగూడ, జీవన్గి బృందాలు పాల్గొన్నాయి. శుక్రవారం రాకంచర్ల పంచమ పీఠాధిపతి వెంకటాచార్యులు మానస పూజ నిర్వహించిన అనంతరం అఖండ భజన ముగింపు సమావేశం ఉంటుందని అనంతగిరి పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు.
పోలీసుల అరెస్టు అప్రజాస్వామికం
సేవలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు
శంకర్‌నాయక్
పరిగి: లగచర్లలో జరిగిన పరిణామాలను తెలుసుకోవడానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సేవలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం లగచర్ల వెళ్తున్న క్రమంలో గడిసింగపూర్‌లో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లగచర్ల ఘటన నేపథ్యంలో నిజనిర్ధారణ కమిటీతో తెలుసుకునేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. రైతుల పక్షాన సేవలాల్ సేనా ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా తాము రైతుల వెంటే నిలుస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సేవలాల్ సేనా నేతలు తదితరులు పాల్గొన్నారు.
నృత్య ప్రదర్శనలో
చిన్నారుల సత్తా
అనంతగిరి: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన నమో యామిని, నమో కృష్ణమూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్‌లో వికారాబాద్‌కు చెందిన శ్రీ సరస్వతి నృత్య అకాడమికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఇందులో భాగంగా వ్యక్తిగత విభాగంలో అకాడమికి చెందిన శశాంక్ దశావతార నృత్య ప్రదర్శనతో ఉత్తమ ప్రతిభ చాటి జూనియర్ రౌండ్‌లో మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా రెండో స్థానంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో సంవేద్య నిలిచారు. సబ్ జూనియర్ రౌండ్‌లో మహస్విత రెండో స్థానంలో నిలిచింది. దీంతో పాటు గ్రూప్ డ్యాన్స్ విభాగంలో తెలంగాణ ఫోక్ సాంగ్‌తో చక్కటి ప్రదర్శన అందించి మొదటిస్థానంలో నిలిచారు. ఈ పోటీల్లో 16 రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖులు, నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment