శాస్త్రవేత్తల కృషి అభినందనీయం
తాండూరు: తాండూరు కందిపప్పు భౌగోళిక గుర్తింపు పొందడానికి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని ఐసీఎస్‌ఆర్ కమిటీ సభ్యులు డాక్టర్ సౌమ్య వినయన్ పేర్కొన్నారు. బుధవారం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్‌లో భాగమైన హైదరాబాద్‌కు చెందిన ప్రతినిధుల బృందం తాండూరును సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయస్థానం ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ సుధారాణి, శాస్త్రవేత్తలతో భౌగోళిక గుర్తింపు పొందిన తాండూరు కంది ఉత్పత్తులపై వారితో కలిసి పొలాన్ని పరిశీలించారు. తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు లభించిన తర్వాత మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని వారు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ గుర్తింపు రావడానికి విశేష కృషి చేసిన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ నుంచి వివరాలను సేకరించారు. తాండూరు కంది పంట పోషక విలువలపై వివరించారు. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చే సందర్భంగా ఎదుర్కొన్న సవాళ్లను, అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ ఓ వన్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రభిర్ మిశ్రా, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
ఐసీఎస్‌ఆర్ కమిటీ సభ్యులు
డాక్టర్ సౌమ్య వినయన్
Comments
Please login to add a commentAdd a comment