సర్వేతో అన్ని వర్గాలకు లబ్ధి
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం శాంతినగర్ కాలనీలోని ఎమ్మెల్యే ఇంట్లో ఎన్యుమరేటర్లు, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కుటుంబ వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేట్లరకు కుటుంబ వివరాలు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏరియా సూపర్ వైజర్ శారద, ఎన్యుమరేటర్ ఆంజనేయులు, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి
తాండూరు రూరల్: ఎరువులు, విత్తనాల కోసం వచ్చే రైతులను ఫర్టిలైజర్ దుకాణ యజమానులు ఇబ్బంది పెట్టరాదని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. బుధవారం తాండూరులోని గణేశ్ ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌కు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎమ్మార్పీకే విక్రయించాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరి కోతల తర్వాత వరి కొయ్యలను కాల్చవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రుద్రమూర్తి, ఏఓ కొమరయ్య, ఏఈఓలు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ ఇలాగేనా?
గ్రామ కార్యదర్శిపై డీపీఓ జయసుధ ఆగ్రహం
ధారూరు: మండలంలోని నాగసమందర్ గ్రామ పంచాయతీని బుధవారం డీపీఓ జయసుధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కంపోస్టు షెడ్డు, నర్సరీ, వైకుంఠధామాన్ని పరిశీలించారు. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించిందని, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి విధులకు సక్రమంగా హాజరు అవుతున్నారా అని ఆరా తీశారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన డబ్బాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీఓ షపీఉల్లా పాల్గొన్నారు.
నేడు ‘చలో లగచర్ల’
అనంతగిరి: వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం చలో లగచర్ల కార్యక్రమం చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్ రాములు తెలిపారు. బుధవారం వికారాబాద్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల భూములను బలవంతంగా లాక్కోరాదని ప్రభుత్వానికి సూచించారు. దుద్యాల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటును వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. రైతుల అరెస్టును కండిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్, నాయకులు వెంకటయ్య, శ్రీనివాస్, చంద్రయ్య, సతీష్, నవీన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment