ప్రసవాలు చేయకుంటే మీరెందుకు
మోమిన్‌పేట: అన్ని వసతులు ఉన్నా ప్రసవాలు ఎందుకు చేయడం లేదని, అలాంటప్పుడు మీరు ఇక్కడ ఎందుకని మోమిన్‌పేట పీహెచ్‌సీ వైద్యులపై డీఎంహెచ్‌ఓ వెంకటరవణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి గర్భిణులు వస్తున్నా కాన్పులు ఎందుకు చేయడం లేదని వైద్యాధికారి సుజలను ప్రశ్నించారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ నెలలో ఆయా గ్రామాలకు చెందిన 50మంది కాన్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా ఒక్కరు కూడా ఆస్పత్రిలో పురుడు పోసుకోలేదని అన్నారు. గత నెలలో 44మంది మహిళలు కాన్పులు చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నా కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ కాన్పులు చేసుకున్నారని తెలిపారు. అన్ని హై రిస్క్ కేసులే వస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించమని హెచ్చరించారు. గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఐఓ బుచ్చిబాబు, వైద్యులు సుజల, రషీద్ తదితరులు ఉన్నారు.
మోమిన్‌పేట పీహెచ్‌సీ వైద్యులపై
డీఎంహెచ్‌ఓ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment