సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల్లో అభిరుచిని పెంచేందుకు డిఫెన్స్, స్పేస్ కన్వెన్షన్–2024 సదస్సు ఏర్పాటు చేయ డం అభినందనీయమని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, భారత రక్షణ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి అన్నారు. బుధవారం గురునానక్ విశ్వవిద్యాలయంలో భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యూత్ సౌజ న్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ప్రపంచంలోని డిఫెన్స్, స్పేస్ రంగా ల్లో నిపుణులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. యువతలో దేశ భక్తి, నైపుణ్యం, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి పలు ముఖ్యమైన విషయాలపై చర్చించారు. శాస్త్ర, సాంకేతిక, టెక్నాలజీ, ఇంజీనిరింగ్ , మేనేజ్‌మెంట్ వంటి విభాగాలలో భవిష్యత్ నాయకులుగా ఎదగాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment