షాబాద్: గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు, రికార్డుల నిర్వహణ, అభివృద్ధి బాగుందని ఒడిశా బృందం సభ్యులు కితాబిచ్చారు. బుధవారం మండల పరిధిలోని సర్ధార్‌నగర్ గ్రామాన్ని ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం సభ్యులు సందర్శించారు. గ్రామంలో పర్యటించిన ఒడిశా బృందం సభ్యులు పంచాయతీ కొనసాగుతున్న తీరును పరిశీలించారు. సొంత నిధుల సేకరణ, రాష్ట్ర నిధుల నిర్వహణ, ఉపాధిహామీ నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతివనం, కంపోస్ట్ యార్డు, వైకుంఠధామం, హరితహారం నర్సరీ తదితరాలను పరిశీలించారు. పంచాయతీల పరిపాలనకు నిధుల సేకరణ, ఆన్‌లైన్ సేవలు చాలా బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిశా అధికారుల బృందం సీఈఓ అనిల్‌కుమార్, జిల్లా శిక్షణ అధికారి రుద్రయ్య, శ్రీనివాస్, షాబాద్ ఎంపీడీఓ అపర్ణ, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ వీరాసింగ్, పంచాయతీ కార్యదర్శులు కవిత, శంకర్, రమేశ్, సిబ్బంది ఉన్నారు.
సర్దార్‌నగర్ పంచాయతీ పాలనపై
ఒడిశా బృందం ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment