భోజనం నాణ్యత లేకుంటే చర్యలు
యాలాల: మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేకుంటే చర్యలు తప్పవని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని గంగాసాగర్, బాగాయిపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఆహారం నాణ్యతగా ఉండేలా స్థానిక ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. అంతకుముందు బాగాయిపల్లిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్ అంజయ్య, ఆర్‌ఐ సాయిచరణ్ తదితరులు ఉన్నారు.
భూకై లాస్‌లో సబ్‌కలెక్టర్ పూజలు
తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం తండాలోని భూకై లాస్‌ను తాండూరు సబ్ కలెక్టర్ దర్శించుకున్నారు. బుధవారం రాత్రి ఆలయంలోని శివలింగానికి సబ్‌కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్రకు సంబంధించిన విషయాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు.
తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment