ముగిసిన మైసిగండి జాతర
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన మైసమ్మ తల్లి ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఆరు రోజుల పాటు భక్త జన సందోహంతో కొనసాగిన ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించడంతో పాటు, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, ఫౌండర్ ట్రస్టీ శిరోలి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, నాయకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, జవహర్, కృష్ణ, తహసీల్దార్ జ్యోతి ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment