వికారాబాద్ అర్బన్: జిల్లాలోని గ్రంథాలయాలను విద్యార్థులు, నిరుద్యోగులు ఉపయోగించుకొని విజ్ఞానం పొందాలని శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌లో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 17 గ్రంథాలయాలు, 3 లక్షల10 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు. పుస్తకాలు చదివితే కొత్త విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యేలా చూస్తామని అన్నారు. మండల కేంద్రాలో గ్రంథాలయాల ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాయల చైర్మన్ రాజేశ్‌రెడ్డి, లైబ్రరీ సెక్రెటరీ సురేష్ బాబు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment