42శాతం రిజర్వేషన్ కల్పించాలి
తాండూరు టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వేంకటేశ్వర రావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 55 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు ఎన్నికల్లో కేవలం 18శాతం రిజర్వేషన్ కల్పించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ వివరాలను బయట పెట్టలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, నరేశ్, ప్రజాపతి, నరసింహ నాయక్, చందు తదితరులు వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.
బీసీ యువజన సంఘం రాష్ట్ర
వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment