ఏసీబీ వలలో అవినీతి అధికారులు
● రూ.5 లక్షలు తీసుకుంటూపట్టుబడిన లంచావతారులు ● కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ
తాండూరు: తాండూరు రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డీఏఓ (డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్) దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్‌రావు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఓ భూ సమస్యను పరిష్కరించేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు ఇందుకు అంగీకరించడంతో సోమ వారం గడువు పెట్టారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం డీఏఓ, సీనియర్ అసిస్టెంట్‌కు రూ.5 లక్షలు అందజేశాడు. ముందుగానే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రత్యేక ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో సీనియర్ అసిస్టెంట్ మాణిక్‌రావుతన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్నారని తెలిపారు.
1064 కాల్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064కి కాల్ చేయాలని అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదుదారుడి పేరు, వివరాలు గొప్యంగా ఉంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment