క్రిస్టియన్లకు అండగా ఉంటాం
● రూ.15 కోట్లతో చర్చిల నిర్మాణానికి కృషి ● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు రూరల్: నియోజకవర్గంలోని క్రిస్టియన్లకు అండగా ఉంటామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరులోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన చర్చిలను గుర్తించినట్లు తెలిపారు. క్రిస్టియన్, మైనార్టీ సంక్షేమ శాఖ నిధులు రూ.15 కోట్లతో అన్ని చర్చిలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో క్రిస్టియన్ల కృషి ఎంతో గొప్పదన్నారు. పేద పాస్టర్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో కూడా సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు బాల్‌రెడ్డి, అంజయ్య, డీఎస్ కె.జనార్దన్, కిరణ్, స్టీఫెన్, అశోక్, స్టీవా న్, సతీష్, ప్రతాప్, మోజేస్, రవి,లక్ష్మణ్, అబ్రహాం, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.
కారు బోల్తా..
వ్యక్తికి గాయాలు
కుల్కచర్ల: ప్రమాదవశాత్తు కారు బోల్తా పడిన ఘటన కుల్కచర్ల మండలంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. వేపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్ నుంచి గ్రామానికి కారులో వస్తుండగా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో అంతారం గ్రామ శివారులో అదుపు తప్పి గుంతలో పడింది. ఆంజనేయులుకు చిన్నపాటి గాయాలయ్యాయి. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజావాణి అర్జీలు
పరిష్కరించండి
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: ప్రజావాణి దరఖాస్తులను సత్వ రం పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ వాసుచంద్రతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి 114 దర ఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీలైనంత త్వర గా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లాసాయి అధికారులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారుల వివరాలను పక్కాగాసేకరించి మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి వివాదాలు, అవకతవకలకు తావులేకుండా సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు.
బడంగ్‌పేటలో
‘హైడ్రా’ పర్యటన
బడంగ్‌పేట్: బడంగ్‌పేట కార్పొరేషన్ కేంద్రంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. నాలాలు, ఓపెన్ స్థలాలు, పార్కుల కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సోమవారం కార్పొరేషన్ పరిధిలో పర్యటించారు. మునిసిపల్ కాలనీ, మారుతీనగర్, ఎంసీఆర్ కాలనీ, గాయత్రిహిల్స్, బాలాజీనగర్, బడంగ్‌పేట మెయిన్‌రోడ్డులో నాలాలపై వెలసిన నిర్మాణాలను పరిశీలించారు. నివేదిక అధారంగా త్వరలో చర్యలు తీసుకుంటామని హైడ్రా ఇన్‌స్పెక్టర్ తిరుమలేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment