హక్కులపై అవగాహన కల్పించండి
● అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: డిజిటల్ విధానం, వర్చువల్ విచారణ పద్ధతిన వినియోగదారులకు న్యాయం చేకూర్చేలా అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..ప్రతి పౌరునికి వినియోగదారుల హక్కు ల గురించి తెలియజేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.వినియోగదారులసమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వినియోగదా రుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా, వారికి న్యాయం చేకూర్చాలన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, ఎస్సీడబ్ల్యూడీఓ మల్లే శం,తూనికలు కొలతలు శాఖ జిల్లా అధికారి రియా జ్, చౌక ధరల దుకాణాల సంఘం జిల్లా అధ్యక్షుడు జూకారెడ్డి, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment